ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ హీరో కోసం తమన్నా డాన్స్ ప్రాక్టీస్!

Tue, Jul 05, 2016
తమన్నా
తమన్నా
తెలుగులో అగ్రకథానాయికగా వెలుగొందుతూ వున్న తమన్నా, తమిళంలో ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే హిందీలోనూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు భాషల్లోను రూపొందుతోన్న 'అభినేత్రి' సినిమాలో ఆమె నటిస్తోంది. ఇది కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా.

ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ హారర్ మూవీలో ప్రభుదేవా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ప్రభుదేవా వున్న సినిమాలో డాన్సులు లేకుండా ఉంటాయా? ఈ సినిమాలో ఆయనతో కలిసి తమన్నా ఒక రేంజ్ లో డాన్స్ చేయనుందట. తమన్నా మంచి డాన్సర్ .. ఆ విషయంలో యంగ్ హీరోలంతా ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే ప్రభుదేవాతో కలిసి స్టెప్స్ వేయడం అంత తేలికైన విషయం కాదు గాబట్టి, అతనితో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట. అందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)