ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రోబో' కాస్ట్యూమ్స్ వల్లనే రజనీకి అనారోగ్యమా?

Tue, Jul 05, 2016
అమెరికాలో విశ్రాంతి తీసుకోవడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన రజనీకాంత్, అక్కడ అనారోగ్యానికి గురైనట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే విషయం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో మరో టాక్ వినిపిస్తోంది. 'రోబో 2.0' సినిమా కోసం రజనీ 'రోబో'గా కనిపించే కాస్ట్యూమ్స్ ను ధరించారట. ఈ కాస్ట్యూమ్స్ బరువు 40 కేజీల వరకూ ఉంటుందని అంటున్నారు.

వేసవిలో ఆయన ఇంతటి బరువైన కాస్ట్యూమ్స్ ను ధరించి .. అవుట్ డోర్ షూటింగులో పాల్గొన్నారు. అలా ఆయన తన శక్తికిమించి కష్టపడటం వలన అనారోగ్యానికి గురికావడం జరిగిందని చెప్పుకుంటున్నారు. వెంటనే ఆ కాస్ట్యూమ్స్ బరువు తగ్గించమని డిజైనర్ తో శంకర్ చెప్పినట్టుగా అనుకుంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేదే తెలియాలి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)