ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రియా సంచలన నిర్ణయం!

Tue, Jul 05, 2016
శ్రియా
శ్రియా
తమకు హీరోయిన్ వేషాలు తగ్గుతున్నాయనగానే చాలా మంది హీరోయిన్లు గౌరవంగా తప్పుకుంటారు. తర్వాత కొన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అక్క, అమ్మ వంటి పాత్రలు చేయడానికి రెడీ అవుతారు. అయితే, శ్రియా మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా, ఇండస్ట్రీని మాత్రం ఇప్పట్లో వదలనన్నట్టు వచ్చిన ప్రతి పాత్రనూ అంగీకరిస్తోంది. నిన్నటి వరకు యంగ్ హీరోల సరసన కథానాయికగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తల్లి పాత్రలకు కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ తమిళ హీరో శింబుకి ఆమె తల్లిగా నటించడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే, ఆధిక్ రవిచందర్ దర్శకత్వంలో శింబు తాజాగా 'అన్బానవన్ అసరాదవన్ అదంగాదవన్' అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర నడివయసుది కాగా, మిగతా రెండు పాత్రలు కొడుకుల పాత్రలు. ఈ సినిమాలో నడివయసు పాత్ర సరసన శ్రియా జంటగా నటిస్తోందట. అంటే, కొడుకుల పాత్రలకు ఇది తల్లి పాత్ర అవుతుందన్న మాట. ఆ విధంగా, ఈ పాత్ర పోషించడానికి అంగీకరించి ఆమె సంచలనానికి కేంద్రబిందువు అయింది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)