ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jul 05, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* తాను ఖాళీగా ఉంటే కనుక అనారోగ్యం పాలవుతానంటోంది అందాలభామ శ్రుతి హాసన్. 'నాకు ఎప్పుడూ చేతి నిండా పని ఉండాలి. లేకపోతే వెర్రిమొర్రి ఆలోచనలు వచ్చి తలనొప్పి, జ్వరం వస్తాయి. అందుకే ఎప్పుడూ ఏదోఒక పనితో బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తాను' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
* బి.జయ దర్శకత్వంలో హరీష్, అవంతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'వైశాఖం' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ పార్టీ షూటింగును ఆమధ్య కజికిస్థాన్ లో నిర్వహించారు. బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
* యువ కథానాయకుడు ప్రిన్స్, వ్యోమనంది జంటగా రూపొందిన 'మరల తెలుపనా ప్రియా' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం ద్వారా వాణి ఎం.కొసరాజు దర్శకురాలిగా పరిచయం అవుతోంది.
* శర్వానంద్, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. శర్వా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చంద్రమోహన్ అనే కొత్త కుర్రాడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)