ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయన్ కొత్త షరతు పెడుతోందా?

Mon, Jul 04, 2016
నయనతార
నయనతార
నయనతారకి ఇప్పుడు కోలీవుడ్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె డేట్స్ దొరకడమే దర్శక నిర్మాతలకి కష్టమైపోతోంది. ఇక ఆమె సమయమిస్తే కథలు వినిపించడానికి పోటీపడే వారి సంఖ్య పెరిగిపోతోందట. అయితే తనకి కథలు వినిపించడానికి వచ్చేవారికి ఆమె, 'నానుమ్ రౌడీ దాన్' .. 'భాస్కర్ ది రాస్కెల్' సినిమాల సీడీలను ఇచ్చి, అలా నటనకి అవకాశం వుండే కథలు సిద్ధం చేసుకుని రమ్మని అంటోందట.

అంతేకాదు కథ తనచుట్టూ తిరిగేలా చూడమనీ .. ఎక్స్ పోజింగ్ ఉండకూడదని చెబుతోందట. దాంతో ఆమెను కలుసుకోవడానికి వచ్చినవాళ్లు, ఆ సీడీలను తీసుకుని దారిపడుతున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో పారితోషికం విషయంలోను .. ప్రమోషన్స్ కి రాననే విషయంలో మాత్రమే నయన్ షరతులు పెట్టేదనీ, ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)