ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ప్రేమమ్' వెనక్కి తగ్గదట!

Mon, Jul 04, 2016
నాగ చైతన్య
నాగ చైతన్య
మలయాళంలో ' ప్రేమమ్' సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో, అదే టైటిల్ తో నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగింపు దశకి తీసుకొచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలానే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉంది.

అదే రోజున 'జనతా గ్యారేజ్' సినిమా కూడా రానుంది. ఎన్టీఆర్ సినిమాతో పోటీ అంటే అంత తేలికైన విషయం కాదు. అయినా ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ ను మార్చుకునే ఆలోచనలో లేదు. ఈ సినిమా కథా కథనాలపై ఈ సినిమా టీమ్ కి బలమైన నమ్మకం ఉందట. అందువల్లనే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇక ఆలోచించవలసిన పనిలేదు అనే ధీమాతో వున్నారు. నాగచైతన్య సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తోన్న ఈ సినిమా, ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)