ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గా రానున్న మరో హీరో!

Mon, Jul 04, 2016
ఆర్యన్ రాజేశ్
ఆర్యన్ రాజేశ్
తెలుగు తెరపై కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నారు. కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో కొంతమంది హీరోలు విలన్ పాత్రలు వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇక హీరోగా పెద్దగా ఛాన్సులు లేనివాళ్లు విలన్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాంటివాళ్ల జాబితాలో ఆర్యన్ రాజేశ్ ఒకరుగా చేరనున్నాడు.

చాలాకాలం క్రిందట 'హాయ్' అనే సినిమా ద్వారా ఆర్యన్ రాజేష్ హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆయన కొన్ని సినిమాలు చేసినా, 'ఎవడి గోల వాడిది' మినహా పెద్దగా ఆడిన సినిమాలు లేవు. దాంతో కొంతకాలంగా ఆయన సినిమాలకి దూరంగా వుంటూ వచ్చాడు. అలాంటి ఆర్యన్ రాజేశ్, త్వరలో విలన్ గా తెరపై కనిపించనున్నాడని అల్లరి నరేశ్ చెప్పాడు. తాను హీరోగా .. అన్నయ్య విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అన్నాడు. తెలుగు తెరపై కొత్త విలన్స్ కి డిమాండ్ ఉంది కనుక, ఆర్యన్ రాజేశ్ సక్సెస్ అవుతాడనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)