ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కూడా దసరాకే రానున్నాడా?

Mon, Jul 04, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. అయితే మరో వారం రోజులు ఆలస్యం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అంటే .. అక్టోబర్ 7న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఈ సినిమా షూటింగు విషయంలో ఇటీవల జరిగిన జాప్యం, విడుదల తేదీపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. వసూళ్ల విషయం కారణంగానే ఈ సినిమాను దసరాకి తెస్తున్నారని కొంతమంది అంటున్నారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో అల్లు అరవింద్ అసంతృప్తిగా ఉండటం వల్లనే, విడుదల సమయం పెరిగిందని మరికొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావలసి ఉంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)