ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హైదరాబాద్ లో 'ధ్రువ' సందడి!

Mon, Jul 04, 2016
చరణ్
చరణ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం రూపొందుతోంది. ఇంతవరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను జరుపుకుంది. హైదరాబాద్ లోను .. కాశ్మీర్ లోను కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక మూడవ షెడ్యూల్ ఈ రోజున హైదరాబాద్ లో మొదలైంది. చరణ్ తో పాటు ప్రధాన పాత్రధారులంతా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

చరణ్ జోడీగా రకుల్ అలరించనుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో నవదీప్ కనిపించనున్నాడు. కార్పోరేట్ స్థాయిలో జరిగే అక్రమాలను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ కొత్తలుక్ తో కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలనే గట్టిపట్టుదలతో సురేందర్ రెడ్డి వున్నాడు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)