ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజతో రంగంలోకి బాబీ!

Mon, Jul 04, 2016
రవితేజ
రవితేజ
బాబీ దర్శకత్వం వహించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం, భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో బాబీ తదుపరి చిత్రం ఏ కథానాయకుడితో వుండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం రవితేజతో ఉండనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'పవర్' సినిమా వచ్చింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే అలరించింది.

దాంతో మరోసారి రవితేజతో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బాబీ వున్నాడట. అందువల్లనే ఇటీవల రవితేజను కలిసి ఒక కథ వినిపించాడని అంటున్నారు. ఈ కథ వైవిధ్యభరితంగా ఉండటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై బాబీ కసరత్తు చేస్తున్నాడట. ఇక చక్రి దర్శకత్వంలో రవితేజ 'రాబిన్ హుడ్' సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత బాబీతో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లవచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)