ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శర్వానంద్ పై దర్శకుడి ఆరోపణలు

Mon, Jul 04, 2016
శర్వానంద్
శర్వానంద్
శర్వానంద్ - నిత్యామీనన్ జంటగా నటించిన 'రాజాధి రాజా' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేరన్ దర్శకుడిగా తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా, కొంత ఆలస్యంగా తెలుగులోకి అనువాదంగా అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో శర్వానంద్ ఎంతమాత్రం సహకరించలేదని, చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో చేరన్ చెప్పాడు. శర్వానంద్ కి కొంత ఎమౌంట్ ఇవ్వవలసి ఉందనీ .. ఇవ్వమని తాము చెప్పలేదని అన్నాడు.

ఆడియో రిలీజ్ కి ఆహ్వానించినా శర్వానంద్ రాలేదని చెప్పాడు. ఇక ఈ సినిమాతో తనకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పడం బాధాకరమని అన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో ఆయన నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నట్టుగా తనకి తెలిసిందనీ, ఇది చాలా దారుణమని చెప్పాడు. ఈ సినిమాను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారనీ, శర్వానంద్ .. నిత్యామీనన్ సహకరించి ఉంటే మరింత సక్సెస్ ను సాధించి ఉండేదని అన్నాడు. మరి ఈ విషయమై శర్వానంద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)