ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిర్మాతల పట్ల తమన్నా సానుభూతి!

Mon, Jul 04, 2016
తమన్నా
తమన్నా
సినిమా హిట్టయినా, ఫ్లాపయినా మొదటిగా దాని ప్రభావానికి గురయ్యేది ఆ చిత్ర నిర్మాతే. హిట్టయితే కోట్లు వస్తాయి... ఫ్లాపయితే రోడ్డు మీద పడతాడు. అలా అపజయాల పాలైన నిర్మాతలను ఎవరూ పట్టించుకోరు. వాళ్ల గురించి ఎక్కడా మాట్లాడరు కూడా. అయితే, మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం అలాంటి నిర్మాతల పట్ల సానుభూతి చూపుతోంది. తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతను చూస్తే చాలా బాధ కలుగుతుందని అమ్మడు చెప్పింది.

"ఏ సినిమా అయినా నాకు కథ నచ్చితేనే చేస్తాను. హిట్టవుతుందన్న అంచనాలతోనే ఆ సినిమా చేస్తాం. అయితే, ఒక్కోసారి మన అంచనాలు తప్పవుతాయి. దాంతో సదరు నిర్మాత ఆర్థికంగా నష్టపోతాడు. అలాంటప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఆ నిర్మాతను చూస్తే మనస్తాపం కలుగుతుంది. అందుకే, నాతో సినిమాలు చేసే నిర్మాతలంతా సక్సెస్ అవ్వాలని, నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తాను" అని చెప్పింది తమన్నా.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)