ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమాపై అవన్నీ రూమర్లేనట!

Sun, Jul 03, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ తాజా చిత్రం నుంచి దర్శకుడు ఎస్.జె.సూర్య తప్పుకోవడం ... ఆ ప్రాజక్టులోకి కొత్తగా దర్శకుడిగా డాలీ రావడం మనకు తెలిసిందే. దీంతో సూర్య చేసిన సబ్జెక్టు డాలీకి నచ్చలేదని, మళ్లీ ఆ స్క్రిప్తుపై వర్క్ చేస్తున్నాడని, అసలు ఈ సినిమానే కేన్సిల్ అయిందనీ... ఇలా రకరకాల వార్తలు గత నాలుగు రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ కి గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత, పవన్ సన్నిహితుడు శరత్ మరార్ స్పందించారు. ఈ చిత్రంపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని, సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు. సో, ఈ విషయంలో పవర్ స్టార్ అభిమానులు నిశ్చింతగా ఉండచ్చు!
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)