ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' టీజర్ వచ్చేస్తోంది!

Sun, Jul 03, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో, టీజర్ విషయంలో ఈ సినిమా టీమ్ మరింత శ్రద్ధ తీసుకుంది. టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేయాలనే ఉద్దేశంతో దానిని సిద్ధం చేస్తున్నారు. ఈ టీజర్ ను ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఏవైతే ఆశిస్తున్నారో .. ఆ అంశాలను పొందుపరుస్తూ ఈ టీజర్ ను రెడీ చేస్తున్నారు. కొరటాల శివ ఎంచుకునే కథ .. కథనాలపై ఎన్టీఆర్ అభిమానులకు మంచి నమ్మకం ఉంది. అలాగే కొత్తదనం పట్లనే ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతారనే ఉత్సాహం ఉంది. ఈ కారణంగా ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమాపై, అంచనాలు పెరుగుతూపోతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)