ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కినేనివారి ఇంట పెళ్లి సందడి!

Sun, Jul 03, 2016
నాగార్జున
నాగార్జున
నాగచైతన్య .. సమంతా ప్రేమ .. పెళ్లి వార్తలు కొన్ని రోజులుగా ఒక రేంజ్ లో షికారు చేస్తూ వస్తున్నాయి. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించక పోవడంతో మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా అఖిల్ ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. అఖిల్ ఒక ఆంగ్లపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

శ్రియా భూపాల్ అనే ఆ అమ్మాయి, నాగ్ ఫ్యామిలీకి బాగా తెలుసనే విషయం అందరి దృష్టికి వచ్చింది. చైతూ .. అఖిల్ ఇష్టపడిన అమ్మాయిలతో వాళ్ల పెళ్లిళ్లు జరిపించడానికి నాగార్జున .. అమల సుముఖతను వ్యక్తం చేశారని అంటున్నారు. డిసెంబర్ లో వీళ్ల వివాహాన్ని జరిపించడానికి రంగం సిద్ధమవుతోందని చెబుతున్నారు. నాగ్ తనయులు ఇద్దరూ ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకోవడానికి సిద్ధం కావడం ఒక విశేషమైతే, ఒకే నెలలోనే ఇద్దరూ పెళ్లి కొడుకులు అవుతుండటం మరో విశేషం.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)