ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలోపడిన 'బాబు బంగారం' టీమ్!

Sat, Jul 02, 2016
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్పీడుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేదే ఇంకా సందిగ్ధంలో వుంది. దీనికి కారణం రజనీకాంత్ 'కబాలి' సినిమా అని తెలుస్తోంది.

ఎందుకంటే, అసలు మొదట్లో అనుకున్న ప్రకారం 'బాబు బంగారం'ను జూలై 1న విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే, అదే సమయానికి 'కబాలి'ని విడుదల చేస్తున్నట్టుగా ఆ సైడు నుంచి ప్రకటన వచ్చింది. దీంతో రజనీతో పోటీ ఎందుకని, తమ రిలీజ్ ను పొడిగించుకుని, ఆ ప్రకారం వర్క్ చేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో నిన్న రిలీజ్ కావలసిన రజనీ సినిమా మళ్లీ వాయిదాపడింది. ఈ నెల 22కి దీనిని పోస్ట్ పోన్ చేసినట్టు వార్తలొస్తున్నా, అధికారికంగా ఇంకా అది ధ్రువీకరణ కాలేదు. దీంతో 'బాబు బంగారం' టీమ్ రిలీజ్ విషయంలో మళ్లీ ఆలోచనలో పడింది. ఏమైనా, 'కబాలి' రిలీజ్ విషయంలో అధికారిక ప్రకటన వస్తే కాని 'బాబు బంగారం' విడుదల కన్ఫర్మ్ అయ్యేలా లేదు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)