ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ మూవీ మొదలైంది

Sat, Jul 02, 2016
నాగార్జున
నాగార్జున
రాఘవేంద్రరావు - నాగార్జున కాంబినేషన్లో ఒక భక్తిరసాత్మక చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వరస్వామితో ప్రత్యక్షంగా సంభాషించిన 'హథీరామ్ బావాజీ' జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి, 'ఓం నమో వెంకటేశాయ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ రోజున, హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఆరంభించారు.

ఇక్కడ వేసిన ఆలయం సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో ఫ్లోర్ లో రాజదర్బార్ సెట్ వేశారు. ఈ రెండు సెట్స్ లో కలుపుకుని దాదాపు 40 రోజుల పాటు షూటింగు చేయనున్నట్టు సమాచారం. ఆ తరువాత ఔట్ డోర్ షూటింగుకి వెళతారని అంటున్నారు. గతంలో నాగార్జున .. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తిచిత్రాలు అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాయి. అదే జాబితాలో ఈ సినిమా చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)