ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పార్వతీశం మంచి మార్కులే కొట్టేశాడు!

Sat, Jul 02, 2016
'రోజులు మారాయి'లో పార్వతీశం - తేజస్వీ
'రోజులు మారాయి'లో పార్వతీశం - తేజస్వీ
మారుతి .. దిల్ రాజు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 'రోజులు మారాయి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చేతన్ .. పార్వతీశం .. తేజస్వీ .. కృతిక ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ .. కథనాలు .. సినిమా రిజల్ట్ విషయం అలా ఉంచితే, ఈ నటీనటులు తమ పాత్రల పరిధిలో చాలా చక్కగా నటించి మెప్పించారని అంటున్నారు.

ముఖ్యంగా పార్వతీశం కామెడీ టైమింగ్ .. డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయని చెబుతున్నారు. 'కేరింత' సినిమా సమయంలోనే, పార్వతీశానికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలోకన్నా అతను చాలా ఈజ్ తో ఈ పాత్ర చేశాడని అంటున్నారు. కామెడీ టచ్ వున్న పాత్రల్లో అతను చాలా బాగా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత ఆతనికి అవకాశాలు బాగానే పెరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)