ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా 'ఎస్' చెబుతుందా?

Sat, Jul 02, 2016
సమంతా
సమంతా
గౌతమ్ మీనన్ రూపొందించిన 'ఏ మాయ చేసావే' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన సమంతా, ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు తమిళ భాషల్లో ఒక్కసారిగా బిజీతారగా మారిపోయింది. అందుకే, తనకు అంతటి స్థాయిని ఇచ్చిన దర్శకుడు గౌతమ్ ను ఆమె గురువుగా భావిస్తుంది. అలాంటి గౌతమ్ కు ఇప్పుడు ఆమె 'ఎస్' చెబుతుందా? లేక 'నో' చెబుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆ విషయంలోకి వెళితే, గౌతమ్ మీనన్ ఇప్పుడు నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఓ సినిమా తీస్తున్నాడు. తెలుగు నుంచి సాయిధరం తేజ్, మలయాళం నుంచి పృథ్వీరాజ్, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్ లను ఎంచుకున్నాడు. ఇక తమిళ హీరోని ఎంపిక చేయాలి.

కాగా, ముగ్గురు హీరోయిన్లలో అనుష్క, తమన్నా ఇప్పటికే ఎంపికయ్యారు. మరో హీరోయిన్ కోసం సమంతాను సంప్రదిస్తున్నాడట. అయితే, ఆమె త్వరలో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో కొత్త సినిమాలు అంగీకరించడం లేదు. మరి, ఈ క్రమంలో తన గురువు మాటను తీసిపారేయకుండా 'ఊ' అంటుందా? లేక 'నో' అంటుందా? అన్నది త్వరలో తెలుస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)