ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృతి సనన్ 'కిక్ బాక్సింగ్' కథ!

Fri, Jul 01, 2016
కృతి సనన్
కృతి సనన్
తెలుగులో '1 నేనొక్కడినే' .. 'దోచేయ్' సినిమాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన కృతిసనన్, ఆ తరువాత హిందీ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఇప్పుడిప్పుడే ఆమె స్పీడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కిక్ బాక్సింగ్ ను సాధన చేస్తోందట. దాంతో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఒక సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చిందనీ, అందుకే దానిని ప్రాక్టీస్ చేస్తోందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని కృతిసనన్ అంటోంది. తన ఫిజిక్ ను మరింత ఫిట్ గా ఉంచడం కోసం తాను డాన్స్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటానని చెబుతోంది. అలాగే కిక్ బాక్సింగ్ ను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటానని చెబుతోంది. అంతేతప్ప ఇదంతా తాను సినిమా కోసం చేస్తోన్న ప్రాక్టీస్ కాదని స్పష్టం చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)