ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శక నిర్మాతలకు రెజీనా కొత్త షరతు!

Fri, Jul 01, 2016
రెజీనా
రెజీనా
తెలుగు తెరపై మాంచి జోరు చూపిస్తోన్న కథానాయికల్లో రెజీనా ఒకరు. ఆమె అంగీకరించిన తెలుగు చిత్రాల జాబితాలో 'జ్యో అచ్యుతానందా' .. 'నక్షత్రం' కనిపిస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న 'నక్షత్రం'లో ఆమె బికినీలో కనిపించనుందనే వార్త చాలా రోజులుగా షికారు చేస్తోంది. ఇందులో నిజమెంతో తెలియక రెజీనా అభిమానులు సతమతమై పోతున్నారు. ఇటీవల ఒక సందర్భంలో ఈ విషయంపై ఆమె స్పందించింది.

ఈ సినిమాలో బికినీ సీన్ పై క్లారిటీ రావలసి ఉందని చెప్పింది. కథకి అవసరమైనప్పుడు బికినీ సీన్ లో కనిపించడం గురించి ఆలోచిస్తాననీ, అయితే అలాంటి సీన్ కనుక ఉంటే ఆ సీన్ చిత్రీకరణకు ఒక నెల రోజులు ముందుగా తనకి చెప్పవలసి ఉంటుందని అంది. ఇలాంటి సీన్స్ లో కనిపించడం ఇబ్బందే కనుక, మానసికంగా సిద్ధం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)