ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కల్యాణ్ రామ్ తో పూరీ సినిమా 'ఇజం'?

Fri, Jul 01, 2016
కల్యాణ్ రామ్ - పూరీ జగన్నాథ్
కల్యాణ్ రామ్ - పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, ఆయన సరసన 'అదితి ఆర్య' నటిస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ ఓ పవర్ ఫుల్ జర్నలిస్టుగా, కొత్తలుక్ తో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక పూరీ సినిమా అనగానే టైటిల్ పట్ల కూడా అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తుంటారు. పూరీ టైటిల్ తోనే సినిమాకి సగం క్రేజ్ ను తీసుకొచ్చేయడమే అందుకు కారణం. అలాగే ఈ సినిమా టైటిల్ కోసం వాళ్లంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరీ - కల్యాణ్ రామ్ 'ఇజం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఇదే టైటిల్ ను ఖరారు చేస్తారో .. మారుస్తారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)