ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఇంకొక్కడు'గా రానున్న విక్రమ్

Fri, Jul 01, 2016
'ఇంకొక్కడు' లో నిత్యామీనన్ - విక్రమ్
'ఇంకొక్కడు' లో నిత్యామీనన్ - విక్రమ్
విక్రమ్ కథానాయకుడిగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఇరుముగన్' చిత్రం రూపొందుతోంది. విక్రమ్ సరసన నయనతార .. నిత్యామీనన్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తెలుగు టైటిల్ గా 'ఇంకొక్కడు'ను ఫిక్స్ చేశారు. సింగపూర్ లో జరుగుతోన్న 'సైమా' వేడుకల్లో ఈ తెలుగు టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఈ సినిమా తెలుగు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

తమిళంలోనే కాదు తెలుగులోనూ విక్రమ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ రెండు భాషల్లోను నయనతార .. నిత్యామీనన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందువల్లనే ఈ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆగస్టులో రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడిగా విక్రమ్ చేసే విన్యాసాలు ఎలాంటివో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)