ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోగా రానున్న చిరూ చిన్నల్లుడు?

Fri, Jul 01, 2016
కల్యాణ్
కల్యాణ్
మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా వస్తోన్న హీరోలు, తెరపై ఒక రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ కూడా త్వరలో తెరపైకి రానున్నట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ మధ్యనే కల్యాణ్ తో జరిగింది. కల్యాణ్ ను చూసిన వాళ్లంతా హీరోలానే వున్నాడనీ, తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని చాలామంది అనుకున్నారు.

ఆ మాటలు త్వరలో నిజమయ్యే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. నటన పట్ల తనకి ఆసక్తి ఉందని చిరంజీవితో కల్యాణ్ చెప్పాడనీ, అందుకు ఆయన సుముఖతను వ్యక్తం చేశాడని అంటున్నారు. ఫిజిక్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోమనీ, నటనలోను శిక్షణ తీసుకోమని చిరూ సూచించాడని చెబుతున్నారు. అదే నిజమైతే త్వరలోనే తెలుగు తెరపై హీరోగా కల్యాణ్ చేసే సందడిని చూడొచ్చు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)