ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Jul 01, 2016
సమంతా
సమంతా
* 'ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి' అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంతా. "ఇప్పుడు ప్రేమకథలు చేసే వయసు నాది. ఈ వయసు దాటితే ప్రేమకథలు చేయలేను. అప్పుడు చేసినా చూడరు కూడా. అందుకే ఎక్కువగా ఇప్పుడు ప్రేమకథలే చేస్తున్నాను" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కథానాయిక ప్రధాన చిత్రాలు చేయాలని ఉన్నప్పటికీ, ధైర్యం చాలడం లేదని చెప్పింది. 'ఎప్పుడైతే అలాంటి ధైర్యం వస్తుందో అప్పుడు అలాంటివి చేస్తాను' అని చెప్పింది సమంతా.
* ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో రూపొందుతున్న 'షో టైం' చిత్రం షూటింగు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటోంది. దీని టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తారు. అలాగే వచ్చే నెలాఖరుకి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
* అల్లు అర్జున్ తో తాను చేయాల్సిన ప్రాజక్టు వాయిదా పడిందని ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి తెలిపాడు. ఇంతకు ముందుగా కమిట్ అయిన చిత్రాన్ని పూర్తి చేయాల్సివున్నందున బన్నీతో చిత్రాన్ని వచ్చే ఏడాది చేస్తానని స్పష్టం చేశాడు. చిత్రం వాయిదా పాడిందే కానీ, కేన్సిల్ కాలేదని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)