ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వినాయక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చరణ్ తో!

Thu, Jun 30, 2016
చరణ్
చరణ్
వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా షూటింగు జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాత అనే విషయం తెలిసిందే. అందువలన ఇద్దరూ ఈ సినిమా సెట్స్ లో కలుస్తూనే వున్నారు. ఆ సమయంలోనే తామిద్దరం కలిసి మళ్లీ ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.

గతంలో వినాయక్ తో కలిసి చరణ్ 'నాయక్' సినిమా చేశాడు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందువలన తమ కాంబినేషన్లో మరో హిట్ రావాలనే ఆసక్తిని ఇద్దరూ కనబరిచినట్టు చెప్పుకుంటున్నారు. చిరంజీవికి 'ఠాగూర్' హిట్ ఇచ్చిన వినాయక్, ఆయనతో మరో సినిమా చేస్తున్నాడు. అలాగే చరణ్ కి 'నాయక్' హిట్ ఇచ్చిన వినాయక్, ఆయనతోను మరో సినిమా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)