ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒక మనసు' దర్శకుడి కొత్త కథ!

Thu, Jun 30, 2016
రామరాజు
రామరాజు
'ఒక మనసు' సినిమా ద్వారా మెగా హీరోయిన్ గా నిహారికను పరిచయం చేసిన రామరాజు, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. 'ఒక మనసు' సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన మధుర శ్రీధర్ .. ఈ సినిమాను కూడా నిర్మించనున్నాడు. ఇది కూడా ప్రేమకథే కావడం విశేషం. తాజాగా ఈ సినిమాకి 'చీకటి ప్రేమకథ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కచ్చితంగా ఇది యూత్ లో ఆసక్తిని రేకెత్తించే టైటిలే అనడంలో సందేహం లేదు.

అసలు 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రంతోనే, హృదయానికి హత్తుకునేలా రామరాజు చిత్రీకరణ వుంటుందనే పేరు వచ్చింది. 'ఒక మనసు' సినిమాలోనూ ఆయన చక్కని ఫీల్ ను ఆవిష్కరించాడు. ఇప్పుడు 'చీకటి ప్రేమకథ' చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)