ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్

Thu, Jun 30, 2016
అమైరా దస్తూర్
అమైరా దస్తూర్
వరుస విజయాలతో దూసుకుపోతోన్న రాజ్ తరుణ్, ఇటీవల మూడు నాలుగు కొత్త సినిమాలను అంగీకరించాడు. ఈ జాబితాలో సంజనా రెడ్డి అనే దర్శకురాలు తెరకెక్కించే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే ను మారుతి అందిస్తున్నాడు. ఈ సినిమాలో కథనాయిక పాత్ర కోసం కొంతమందిని పరిశీలించి, చివరికి 'అమైరా దస్తూర్'ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

గతంలోను కొంతమంది దర్శక నిర్మాతలు అమైరా దస్తూర్ ను సంప్రదించారు. ఎందువల్లనో కానీ ఆమె ఆ సినిమాలు చేయలేదు. రాజ్ తరుణ్ సినిమాను చేయడానికి ఆమె అంగీకరించిందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకిగాను రాజేంద్రప్రసాద్ ను తీసుకున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రెడీ అవుతోన్న ఈ కథ, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)