ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బరువు తగ్గలేకపోతోన్న అనుష్క!

Thu, Jun 30, 2016
అనుష్క
అనుష్క
వెండితెర చందమామగా .. ఏ వంకా పెట్టలేని అందాల భామగా అనుష్కను గురించి చెప్పుకుంటారు. అలాంటి అనుష్క బరువును తగ్గలేక నానా ఇబ్బందులు పడుతోందనే టాక్ వినిపిస్తోంది. 'సైజ్ జీరో' కోసం ఆ మధ్య బరువు పెరిగిన అనుష్క, అనుకున్నంత తేలికగా బరువు తగ్గలేకపోతోందట. బరువు తగ్గడానికి ఆమె ఎంతగానో ప్రయత్నం చేస్తూనే ఉందని అంటున్నారు.

'దేవసేన' పాత్ర కోసం 10 కేజీలు తగ్గవలసి ఉంటుందని రాజమౌళి ఆమెకి చెప్పాడట. వచ్చే నెల నుంచి అజిత్ తో ఆమె కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకి కూడా బరువు తగ్గమని దర్శకుడు కోరాడట. ఇక 'భాగమతి' కోసం బరువు తగ్గాలని తానే భావిస్తోందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ లోను అనుష్కను చూసిన వాళ్లు, ఆమె బరువు తగ్గితే బాగుంటుందని కామెంట్లు చేశారు. మరి అనుష్క ఏం చేస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)