ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో రీమేక్ ఆలోచనలో యంగ్ హీరో!

Thu, Jun 30, 2016
నాగచైతన్య
నాగచైతన్య
నాగచైతన్య కథానాయకుడిగా 'ప్రేమమ్' చిత్రం రూపొందుతోంది. ఇది మలయాళ చిత్రానికి రీమేక్. తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు తమిళ రీమేక్ లపై చైతూ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వాటిలో 'ఈట్టి' పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

తమిళంలో రవి అరసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అధర్వ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అదే దర్శకుడితో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చేయాలనే ఆలోచనలో చైతూ వున్నాడని అంటున్నారు. ఒక వ్యాధితో బాధపడుతోన్న వ్యక్తి, తన బలహీనతను అధిగమించి అథ్లెట్ గా ఎదగడం అనేదే ఈ సినిమా కథాంశం. రవి అరసు మొదట ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడట. కానీ కుదరకపోవడంతో ఈ కథ చైతూ దగ్గరికి వచ్చిందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)