ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా ఆ చిత్రం వదిలేసిందట...కారణం?

Thu, Jun 30, 2016
సమంతా
సమంతా
ప్రస్తుతం చెన్నయ్ బ్యూటీ సమంతా ధోరణి చూస్తుంటే అందరికీ అనుమానం వస్తోంది. ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ, కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఒక్క 'జనతా గ్యారేజ్' చిత్రం మాత్రమే చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కొత్త ప్రాజక్టులు ఏవీ కమిట్ కాలేదు. మరో విషయం ఏమిటంటే, ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే 'వడ చెన్నయ్' చిత్రాన్ని చేయడానికి ఈ చిన్నది ఆమధ్య ఓకే చెప్పింది. అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే, తాజాగా, ఈ ప్రాజక్టు నుంచి ఆమె బయటకు వచ్చేసినట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి, ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశాడు. అయితే, తాను ఒక భాగంలో నటించి ఇతర భాగాలలో నటించకపోతే బాగుండదని దర్శక నిర్మాతలకు విడమరచి చెప్పి ఒప్పించి, తాజాగా ఆమె ఈ సినిమాకు బై చెప్పిందట. దీనికంతటికీ కారణం, త్వరలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలని నిర్ణయించుకోవడమేనని అంటున్నారు. నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్టు గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్ లలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరూ ఈ వార్తను ఇంతవరకు ఖండించనూ లేదు, ధ్రువీకరించనూ లేదు... అదే విశేషం!
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)