ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దసరాకి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'

Wed, Jun 29, 2016
అల్లరి నరేశ్ ఈసారి తన కామెడీకి కాస్తంత హారర్ టచ్ ఇవ్వనున్నాడు. అలాంటి కథాంశంతో రూపొందుతోన్న సినిమాయే 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రేపు అల్లరి నరేశ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాను గురించి నిర్మాత మాట్లాడారు.

ఈ నెల 23 నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోందని ఆయన అన్నారు. ఇది హారర్ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా కథను .. పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దాడని అన్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నాగేశ్వర రెడ్డి - అల్లరి నరేశ్ కాంబినేషన్ లో గతంలో 'సీమశాస్త్రి' .. 'సీమటపాకాయ్' సినిమాలు వచ్చాయి. ఈ సినిమాతో వీళ్లకి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)