ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీని కొత్తగా చూపిస్తాడట!

Wed, Jun 29, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
'సరైనోడు' వసూళ్లతో తన సత్తా చాటిన అల్లు అర్జున్, త్వరలో హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం హరీశ్ శంకర్ రెడీ చేసిన కథ .. వైవిధ్యభరితంగా ఉండటం వలన, అల్లు అర్జున్ వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం హరీశ్ శంకర్ ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడని అంటున్నారు.

సాధారణంగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే హరీశ్ కథలను సిద్ధం చేస్తుంటాడు. 'గబ్బర్ సింగ్' .. 'రామయ్యా వస్తావయ్యా' .. 'సుబ్రమణ్యం ఫేర్ సేల్' సినిమాలు ఇదే విషయాన్ని నిరూపించాయి. హీరోని కొత్తగా చూపించడం .. హీరో చెప్పే డైలాగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేస్తుంటాడు. ఇక్కడే ఆయన ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంటాడు. అలాగే ఈసారి బన్నీని కొత్త లుక్ తో చూపించడమే కాకుండా, ఆయన చెప్పే డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూస్తున్నాడని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)