ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాశ్మీర్ నుంచి తిరిగిరానున్న 'ధ్రువ'

Wed, Jun 29, 2016
చరణ్
చరణ్
చరణ్ .. రకుల్ జంటగా 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను 10 రోజులుగా కాశ్మీర్ లో జరుపుతూ వచ్చారు. చరణ్ .. రకుల్ .. నవదీప్ .. ఇతర పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అలాగే చరణ్ .. రకుల్ పై ఒక పాటను కూడా తెరకెక్కించారు. దాంతో కాశ్మీర్ కి సంబంధించిన షెడ్యూల్ పూర్తయింది.

చరణ్ .. నవదీప్ ఐపీఎస్ ఆఫీసర్స్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నాడు. తమిళంలో 'తని ఒరువన్' పేరుతో వచ్చిన ఈ సినిమా అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దాంతో తెలుగులోనూ ఈ సినిమాకి అదే స్థాయి ఆదరణ లభిస్తుందని చరణ్ భావిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)