ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా, సమంతా ఇద్దరూ ఆగిపోయారు!

Wed, Jun 29, 2016
తమన్నా
తమన్నా
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వారు, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా, 'చికాగో'లో భారీ స్థాయిలో వేడుక జరపనున్నారు. అమెరికాలోని తెలుగువారి కోసం ఈ అసోసియేషన్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తికావొచ్చాయి. ఈ సందర్భంగా ఈసారి వేడుకలను మరింత గ్రాండ్ గా జరపనున్నారు. జూలై 1 .. 2 .. 3 తేదీలలో జరిగే ఈ వేడుకలకి సంబంధించి, ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు అందాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సినీ .. రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా .. సమంతా కూడా 'ఆటా' వేడుకలకి హాజరుకానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఈ వేడుకలకి వెళ్లడం లేదని తమన్నా చెప్పింది. అలాగే సమంతా చెబుతూ, వెళదామని అనుకున్నా కొన్ని వ్యక్తిగతమైన కారణాల వలన ఆగిపోతున్నానని చెప్పుకొచ్చింది. ఇది అక్కడి అభిమానులను నిరాశ పరిచే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)