ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అతనితో కెమిస్ట్రీ అదుర్స్ అంటోన్న హన్సిక!

Wed, Jun 29, 2016
హన్సిక
హన్సిక
ఏ ముహూర్తాన తమిళ సినిమా రంగంలో హన్సిక కాలుపెట్టిందో గానీ, అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఇతర చిత్రాలకి సమయాన్ని కేటాయించలేనంతగా ఆమె బిజీగా ఉంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఆమె నటించిన 'మనిదన్' చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో తాను పోషించిన గ్రామీణ యువతి పాత్ర తనకి మంచి పేరు తెచ్చిపెట్టిందనీ, ఉదయనిధితో తన కెమిస్ట్రీ అదిరిందని హన్సిక ఆనందిస్తోంది. కోలీవుడ్లో ఇన్ని సినిమాలు చేసినా తనకి తమిళం రాదని చాలామంది అనుకుంటారనీ, తనకి తమిళం బాగానే అర్థమౌతుందని అంది. కొంతవరకూ తమిళం మాట్లాడగలనని చెప్పింది. మరికొన్ని రోజుల్లో తమిళం పూర్తిగా వస్తుందనీ, అందుకే తమిళ సినిమాలు వరుసగా చేయాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే హన్సిక తమిళంలో తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)