ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మారుతి మహా ఘటికుడే!

Wed, Jun 29, 2016
మారుతి
మారుతి
గతంలో దర్శకులు ఒక కథను రెడీ చేయించుకుని .. నిర్మాతలను ఒప్పించి .. హీరోలను మెప్పించి సెట్స్ పైకి వెళ్లే వారు. అలా ఒక సినిమా పూర్తయిన తరువాతనే మరో కథపై దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడున్న దర్శకులలో కొంతమందికి కథను సొంతంగా సిద్ధం చేసుకునే సామర్థ్యం ఉంది. అలాగే వాళ్లు స్క్రీన్ ప్లే కూడా చేయగలరు. అలాంటి వాళ్లలో సుకుమార్ తరువాత మారుతి కనిపిస్తుంటాడు.

ఈ మధ్య దర్శకుడిగా మారుతి యమా బిజీగా వున్నాడు. తాను దర్శకత్వం చేసే సినిమాలకి తాను కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకే కాదు .. ఇతర సినిమాలకి కూడా కథ .. స్క్రీన్ ప్లే ను సమకూరుస్తున్నాడు. ఇలా మారుతి దర్శకుడిగా .. నిర్మాతగా ... రచయితగా కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ రాళ్లు వెనకేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మారుతి మహా ఘటికుడే సుమా! అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)