ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ పవర్ ఫుల్ డైలాగ్ లీక్!

Wed, Jun 29, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 150వ చిత్రంగా 'కత్తిలాంటోడు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. చిరంజీవి జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాన్ని తాజాగా హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో వినాయక్ చాలా ఆసక్తికరంగా చిత్రీకరించాడు. చిరంజీవి ఖైదీగా కనిపించిన చాలా సినిమాలు ఘనవిజయాలు అందుకున్నాయి. దాంతో మెగా అభిమానులు ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని చిరంజీవి డైలాగ్ ఒకటి లీక్ అయిందంటూ నెట్లో హల్ చల్ చేస్తోంది. ''వీళ్లకి దుక్కి దున్నడమే తెలుసుగానీ .. దుర్మార్గం చేయడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసుగాని నరకడం తెలియదు. అలాంటి వీళ్ల పొలాలకు మీరు నీళ్లు ఇవ్వకపోతే, ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కల్ని నరుకుతూ .. మీ గుండెల్ని దున్నుతూ పోతాయి.'' రైతుల పక్షాన నిలబడి చిరంజీవి చెప్పే ఈ డైలాగ్ సూపర్ అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించుకుని ఆనందంతో పొంగిపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)