ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్'కి అదో హైలైట్!

Tue, Jun 28, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చకచకా షూటింగు పూర్తిచేసుకుంటోంది. ఎన్టీఆర్ జోడీగా ఆడియన్స్ ను అలరించడానికి సమంతా .. నిత్యామీనన్ పోటీపడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేవి ఎన్టీఆర్ డాన్సులనే వార్త కూడా షికారు చేస్తోంది. ఈ సినిమాలో డాన్సుల విషయంలో ఎన్టీఆర్ మరింత కేర్ తీసుకున్నాడట. దాంతో ప్రతి పాట .. డాన్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు.

ముఖ్యంగా వెస్ట్రన్ డాన్స్ ను బేస్ చేసుకుని శేఖర్ మాస్టర్ ఒక డాన్స్ ను క్రియేట్ చేశాడట. దేవిశ్రీ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమని చెబుతున్నారు. ఆయన డాన్సులన్నీ వన్స్ మోర్ అనిపించుకుంటే, వాటిల్లో ఈ డాన్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక డాన్సులతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)