ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రైతు' సినిమా ఖాయమని చెప్పిన బాలకృష్ణ

Tue, Jun 28, 2016
బాలకృష్ణ
బాలకృష్ణ
బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 100వ చిత్రంగా 'రైతు' సినిమా తెరకెక్కనుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది. బాలకృష్ణ కోసం కృష్ణవంశీ ఈ కథను రెడీ చేశాడు. అయితే 100 చిత్రం ప్రత్యేక నేపథ్యంలో రూపొందాలనే ఉద్దేశంతో, క్రిష్ కి బాలకృష్ణ అవకాశం ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం రూపొందుతోంది.

దాంతో తరువాత సినిమాగానైనా 'రైతు' ఉంటుందా? ఉండదా? అనే సందేహం బాలకృష్ణ అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఈ సందేహానికి బాలకృష్ణ తెర దించేశారు. హిందూపురంలో ఒక కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, తన 101వ సినిమాగా .. కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' సినిమా ఉంటుందని చెప్పారు. అంటే, వచ్చే ఏడాది బాలకృష్ణ తెరపై 'శాతకర్ణి'గానే కాదు, 'రైతు'గా కూడా సందడి చేయనున్నారన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)