ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కరుణానిధి ఫ్యామిలీతో విక్రమ్ బంధుత్వం

Tue, Jun 28, 2016
విక్రమ్
విక్రమ్
తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన కరుణానిథి కుటుంబంతో స్టార్ హీరో విక్రమ్ బంధుత్వం కలుపుకోనున్నాడు. తన కూతురు 'అక్షిత'ను .. కరుణానిధి మునిమనవడైన 'రంజిత్'కి ఇచ్చి వివాహం చేయనున్నాడు. వచ్చేనెల 10వ తేదీన చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో అక్షిత - రంజిత్ ల నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యులను మాత్రమే ఈ వేడుకకి ఆహ్వానించారట.

వచ్చే ఏడాది జరగనున్న వివాహ మహోత్సవానికి మాత్రం, సినీ రాజకీయ రంగాలకి చెందిన ప్రముఖులను భారీస్థాయిలో ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి తన తాజా చిత్రానికి సంబంధించిన షూటింగు పనులను పక్కన పెట్టి, నిశ్చితార్థపు ఏర్పాట్లలో విక్రమ్ బిజీగా వున్నాడట. మొత్తానికి విక్రమ్ పెద్ద హీరో అనిపించుకోవడమే కాదు, పెద్ద బలగాన్ని కూడా సంపాదించేసుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)