ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూఎస్ లో నితిన్, నాని జోరు!

Tue, Jun 28, 2016
'జెంటిల్ మన్' లో నాని - నివేదా థామస్
'జెంటిల్ మన్' లో నాని - నివేదా థామస్
యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు పెరుగుతూ వస్తోంది. ఈ నెలలో విడుదలైన 'అ ఆ' .. 'జెంటిల్ మన్' సినిమాలు అక్కడ ఒక రేంజ్ లో జోరు చూపిస్తున్నాయి. నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అ ఆ' సినిమా ఈ నెల 2న విడుదలై, ఇప్పటికీ అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇంతవరకూ ఈ సినిమా 16.46 కోట్ల రూపాయలను రాబట్టి, బాహుబలి .. శ్రీమంతుడు తరువాత స్థానాన్ని దక్కించుకుంది.

ఇక రీసెంట్ గా నాని హీరోగా రిలీజైన 'జెంటిల్ మన్' చిత్రం కూడా యూఎస్ లో తన దూకుడు చూపిస్తోంది. రెండవ వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ వారం పోటీకి వచ్చే పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ సినిమాకి మరింత కలిసొచ్చే అంశం. ఈ కారణంగా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి నితిన్ .. నాని కలిసి ఈ నెలలో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)