ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు అర్జున్ కి జోడీగా పూజా హెగ్డే!

Tue, Jun 28, 2016
పూజా హెగ్డే
పూజా హెగ్డే
కన్నడ కస్తూరి పూజా హెగ్డే త్వరలో అల్లు అర్జున్ సరసన జత కట్టనుంది. ఆమధ్య 'ఒక లైలా కోసం', 'ముకుంద' వంటి తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసింది. అయితే, అదే సమయంలో బాలీవుడ్ నుంచి 'మొహంజదారో' సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ రావడంతో అక్కడికి చెక్కేసిన సంగతి విదితమే. ఆ చిత్రానికి బల్క్ డేట్స్ ఇవ్వడంతో మధ్యలో మరే ఇతర సినిమా చేసే అవకాశం పూజాకు దక్కలేదు. ఇప్పుడా చిత్రం పూర్తవడంతో మళ్లీ ఈ చిన్నది దక్షిణాదికి వస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం పూజాను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)