ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని చేతుల మీదుగా మోషన్ పోస్టర్ రిలీజ్!

Mon, Jun 27, 2016
ఇటీవల కాలంలో కొత్త సినిమాలు మరింత పెద్ద సంఖ్యలో రూపొందుతున్నాయి. కొత్తదనంతో యూత్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా రూపొందిన విభిన్న కథా చిత్రమే 'పెళ్లిచూపులు'. విజయ్ దేవరకొండ - రీతూ వర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకి, తరుణ్ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను నాని చేతుల మీదుగా ఈ రోజున రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజ్ కందుకూరి - రాగినేని మాట్లాడుతూ, 'ఎవడే సుబ్రమణ్యం' మూవీలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన విజయ్, ఈ సినిమా ద్వారా హీరోగా ఆడియన్స్ ముందుకు రానున్నాడని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందిందని చెప్పారు. కథ .. కథనాల పరంగానే కాదు, పాటల పరంగా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామనీ, అలాగే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)