ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లాభాలు రాబడుతోన్న ' జెంటిల్ మన్'

Mon, Jun 27, 2016
నాని కథానాయకుడిగా 'జెంటిల్ మన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీ స్ లోని ప్రేక్షకులందరిని ఈ సినిమా ఆకట్టుకుంది. రెండవ వారంలోను గట్టి పోటీ ఇచ్చే సినిమాలేవి రాకపోవడంతో, వసూళ్ల పరంగా ఈ సినిమా దూకుడు కొనసాగింది. అలా రెండవ వారంలోను ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

అలా అన్ని ఏరియాలలో ఈ సినిమా ఇప్పటికే లాభాల బాటలో కొనసాగుతోందని తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించినట్టే లెక్క అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నడిపించిన వైవిధ్యభరితమైన కథా కథనాలు .. నాని విలక్షణమైన నటన .. సురభి - నివేదా థామస్ ల గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయనీ, ఈ స్థాయి వసూళ్లను రాబట్టాయని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)