ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇప్పట్లో డైరెక్షన్ చేయనంటోన్న హీరో!

Mon, Jun 27, 2016
అడవి శేష్
అడవి శేష్
కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ క్రేజ్ సంపాదించుకున్న యువ నటుల్లో అడవి శేష్ ఒకరు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్నాచితక పాత్రలు వేసిన అడవి శేష్ కి, దొంగాట .. క్షణం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 'క్షణం' సినిమాకి కథ అందించిన అడవి శేష్ కి, స్క్రిప్ట్ పై మంచి పట్టువుంది. దాంతో ఆయన తదుపరి రెండు సినిమాలకి స్క్రిప్ట్ ను కూడా తానే రెడీ చేస్తున్నాడు.

అంతేకాదు .. ఈ రెండు సినిమాలకి ఆయనే దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే అంతకుముందు దర్శకత్వం చేయాలని అనుకున్నా, ప్రస్తుతానికి ఆ ఆలోచనని ఆయన విరమించుకున్నాడనేది తాజా సమాచారం. నటుడిగా మరింత బిజీ కావాలని అనుకుంటున్న కారణంగానే, ఆయన డైరెక్షన్ ఆలోచనని పక్కన పెట్టేశాడని అంటున్నారు. ఆయన రెడీ చేసుకుంటోన్న రెండు సినిమాల్లో ఒకటి ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)