ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తన పేరు మర్చిపోయారంటోన్న 'కట్టప్ప'

Mon, Jun 27, 2016
సత్యరాజ్
సత్యరాజ్
ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో కీలకమైన పాత్ర ఏదైనా ఉందనగానే, వెంటనే సత్యరాజ్ గురించి ఆలోచిస్తున్నారు. అంతగా తెలుగులో ఆయన పాప్యులారిటీ పెరిగిపోయింది. గతంలో సత్యరాజ్ హీరోగా చేసిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ చేయబడినా .. చాలా కాలంగా ఆయన ముఖ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నా, 'బాహుబలి'తో ఆయనకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.

ఈ సినిమాలో ఆయన చేసిన 'కట్టప్ప' పాత్రకి వన్స్ మోర్ అననివాళ్లు లేరు .. హ్యాట్సాఫ్ చెప్పనివాళ్లు లేరు. ఇదే విషయాన్ని గురించి సత్యరాజ్ స్పందించారు. 38 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో, తాను ఇంతవరకూ 220 సినిమాలు చేశానని చెప్పారు. తనని అంతా ఎప్పుడూ సత్యరాజ్ అనే పిలిచేవారనీ, అయితే 'బాహుబలి' నుంచి తన అసలు పేరును మరిచిపోయి అంతా 'కట్టప్ప' అని పిలుస్తున్నారని అన్నారు. చిన్నపిల్లలు కూడా తనని 'కట్టప్ప'గానే చెప్పుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఒక పాత్ర ఈ స్థాయిలో ప్రభావం చూపడం విశేషమనీ .. ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే చెందుతుందని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)