ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ డైరెక్టర్ కి ఆ సీక్వెల్ చేయక తప్పలేదు!

Mon, Jun 27, 2016
విశాల్
విశాల్
విశాల్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి' సినిమా సీక్వెల్ కి కొంతకాలం క్రితమే రంగం సిద్ధమైంది. తీరా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకుంటూ ఉండగా ఆగిపోయింది. తెలుగులో అల్లు అర్జున్ అవకాశం ఇచ్చేలా అనిపించడంతో, విశాల్ ప్రాజెక్టును పక్కనే పెట్టేసి లింగుస్వామి ఈ వైపుకి వచ్చేశాడు.

అప్పట్లో ఈ విషయంపై విశాల్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే లింగుస్వామి కాకుండా అల్లు అర్జున్ మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తిరిగి వెనక్కి వెళ్లిన లింగుస్వామి .. 'పందెం కోడి' సీక్వెల్ ను రెడీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సీక్వెల్ కి లింగుస్వామితోను .. హారీస్ జయరాజ్ తోను కలిసి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉందని సోషల్ మీడియా ద్వారా విశాల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీక్వెల్ కి సబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)