ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యాన్స్ తో పవన్ ముఖాముఖి

Mon, Jun 27, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన అక్కడి అభిమానులు ఆయనని ఆహ్వానిస్తూనే వుంటారు .. ఆయన రాకకోసం ఎదురుచూస్తూనే వుంటారు. అలా విదేశాల్లోని అభిమానుల ఆహ్వానం మేరకు ఆయన వచ్చేనెల 9న లండన్ వెళ్లనున్నారు. 'యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్' (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న 'జయతే కూచిపూడి' కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అలాగే యుకె .. యూరప్ లలో అభిమానులతో ముఖాముఖి కార్యక్రమాలకి పవన్ వరుసగా హాజరుకానున్నారు. 'యుక్తా'వారి ఆధ్వర్యంలోనే పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రయాణం ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. తన తాజా చిత్రం సెట్స్ పైకి రావడానికి ఇంకా సమయం ఉండటంతో, పవన్ ఈ సమయాన్ని విదేశాల్లోని తన అభిమానులతో గడపడానికి కేటాయించారని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)