ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ జోడీగా నివేదా థామస్?

Mon, Jun 27, 2016
నివేదా థామస్
నివేదా థామస్
ఎన్టీఆర్ నటిస్తోన్న 'జనతా గ్యారేజ్' సినిమా, షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథను అందించడమే కాకుండా, దర్శకత్వాన్ని కూడా చేపడుతున్నాడు.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకి నటన పరంగా ప్రాధాన్యత బాగా ఉంటుందట. దాంతో ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేయగా, నివేదా థామస్ గుర్తుకు వచ్చిందట. 'జెంటిల్ మన్' చిత్రంలో ఆమె నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిందని ఈ సినిమా యూనిట్ ఎన్టీఆర్ తో చెప్పగా, ఆమెను తీసుకోమని ఆయన అన్నాడట. దాంతో ఆమెకి కథ వినిపించడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. దాదాపు ఆమె ఎంపిక ఖరారు అయినట్టేనట. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే అమ్మడు ఎన్టీఆర్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)